ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం... ఏం చేస్తారంటే...?

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం... ఏం చేస్తారంటే...?

రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సాయంత్రం 6 గంటల తర్వాత ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. ఇవాళ రాత్రి అక్కడే బసచేయనున్నారు.. అయితే, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో సీఎం ఢిల్లీ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన ఎవరెవరిని కలుస్తారు? ఏం మాట్లాడనున్నారనేది? చర్చగా మారింది. అయితే, రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఈ నెల 23వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన, జనవరి 9వ తేదీన అమ్మఒడి కార్యక్రమాలకు ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. అంతేకాదు.. తన పర్యటనలో బీజేపీ జాతీయ చీఫ్‌, హోంశాఖమంత్రి అమిత్‌షాను కలుస్తారని తెలుస్తోంది.. మరికొందరు కేంద్ర మంత్రులతోనూ ఏపీ సీఎం సమావేశం కానున్నారనే ప్రచారం సాగుతోంది. ఇక, తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం రాత్రి తిరిగి అమరావతి చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.