ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీ మార్పులు... ధైర్యంగా వైద్యం చేయించుకోండి... 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భారీ మార్పులు... ధైర్యంగా వైద్యం చేయించుకోండి... 

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా గత నాలుగు రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పధకాలు, అభివృద్ధి తదితర విషయాలపై మన పాలన...మీ సూచనలు కార్యక్రమాన్ని రూపొందించి రివ్యూ చేస్తున్నారు.  ఇందులో భాగంగా ఈరోజు వైద్య ఆరోగ్యం రంగంపై జగన్ సమీక్షను నిర్వహించారు. రివ్యూ లో చర్చించిన ముఖ్య విషయాలు ఇవే. 

 

 •  వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకూడదని వైఎస్సాఆర్ ఆలోచించారు. అందుకే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నీరు గార్చింది. 
 • రూ. 5 లక్షల ఆదాయం ఉన్నవాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తింపు. 
 • కోటి 42 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాము. 
 • క్యాన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ వర్తింపు.  
 • వైద్య ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.  
 • జులై 8 న మరో ఆరు జిల్లాల్లో వర్తింపు. 
 • మిగిలిన ఆరు జిల్లాల్లో దీపావళి, నవంబర్ 14 నుంచి అమలు.  
 • ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు. 
 • రెండు వేలకు పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తింపు.  
 • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు. 
 • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇస్తున్నాం. రూ.5వేల నుంచి రూ.10వేలు పెన్షన్లు ఇస్తున్నాం.  
 • గ్రామ వాలంటీర్లే ఇంటింటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు.  
 • గతంలో ప్రభుత్వ హాస్పిటల్ కు వెళ్లి మందులు తీసుకోవాలంటే భయమేసేది.  మందులు పనిచేయవని అనుకునేవారు. 
 •  కానీ, ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నాం.  ప్రభుత్వ హాస్పిటల్స్ కు ధైర్యంగా వెళ్లేలా మార్పు తీసుకొచ్చాము.  
 • 70 లక్షల మంది విద్యార్థులకు కంటివెలుగు పరీక్షలు.