ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లు వీరే..

ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌లు వీరే..

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అనంతరం ప్రభుత్వ చీఫ్‌ విప్, ప్రభుత్వ విప్‌లను నియమించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా వైసీసీ సీనియర్ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని నియమించిన సీఎం వైఎస్ జగన్... ప్రభుత్వ విప్పులుగా కొలుసు పార్థసారథి, కోరుముట్ల శ్రీనివాసులు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి  భాస్కర్‌రెడ్డి, మాడుగుల ముత్యాల నాయుడును నియమించారు.