ఏపీలో డబుల్ అయిన కరోనా కేసులు

ఏపీలో డబుల్ అయిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా డబుల్ అయింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 87కి చేరింది. 12 గంటల్లో మొత్తం 373 శాంపిళ్లను పరీక్షించగా, వాటిల్లో 330 నెగిటివ్‌గా తేలింది. ఇక ఈరోజు నమోదయిన కేసులలో 12 గంటల్లో కడపలో అత్యధికంగా 15, పశ్చిమ గోదావరిలో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఇక కరోనా నుంచి ఏపీలో ఇప్పటివరకు మొత్తం ఇద్దరు కోలుకున్నారు.