ఏపీలో స్థిరంగా కరోనా కేసులు...

ఏపీలో స్థిరంగా కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గత మూడు రోజులుగా స్థిరంగా 100 కు దిగువగా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 73 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,88,423 కి చేరింది.  ఇందులో 8,80,261 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,003 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు కూడా మరణించలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,159 గా ఉంది . ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 82 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.