ఏపీ కరోనా అప్డేట్‌ : భారీగా తగ్గిన కేసులు

ఏపీ కరోనా అప్డేట్‌ : భారీగా తగ్గిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 179 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,82,721   కి చేరింది.  ఇందులో 8,73,245    మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో నలుగురు మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,138 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 219 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.