ఏపీ కరోనా అప్డేట్‌..భారీగా పడిపోయిన కేసులు

ఏపీ కరోనా అప్డేట్‌..భారీగా పడిపోయిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 94 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,82,815   కి చేరింది.  ఇందులో 8,73,477   మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,199 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మాత్రం మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,139 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.