ఏపీ మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు...

ఏపీ మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. రోజుకు వంద కేసుల దాకా నమోదవుతున్నాయి. తాజాగా కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య   8,83,090కి చేరింది.  ఇందులో 874054 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1896 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,140 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 251 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.