ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఈరోజు కాస్త పెరిగాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 158 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,86,852  కి చేరింది.  ఇందులో 8,78,232   మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,473 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మాత్రం మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,147 కి చేరింది.  ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 172 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.