ఏపీ కరోనా అప్డేట్‌... ఇవాళ ఎన్నంటే

ఏపీ కరోనా అప్డేట్‌... ఇవాళ ఎన్నంటే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిన్నటి మీద కాస్త తగ్గాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  884343 కి చేరింది.  ఇందులో 875836 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1357 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7150కి చేరింది. ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 203 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.