ఏపీ కరోనా అప్డేట్‌... మళ్లీ తగ్గిన కేసులు

ఏపీ కరోనా అప్డేట్‌... మళ్లీ తగ్గిన కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నిన్నటి మీద కాస్త తగ్గాయి. ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,84,454  కి చేరింది.  ఇందులో 8,75,933 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1369 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,152 కి చేరింది. ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 97 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.