ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు

ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గత నాలుగు రోజులుగా స్థిరంగా 100 కు దిగువగా కొనసాగుతున్నాయి. ఇక ఈరోజు రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం కొత్తగా 62 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  8,85,590 కి చేరింది.  ఇందులో 8,77,468  మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా,  962  కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,160 గా ఉంది . ఇక పోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 102 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.