'ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే సుప్రీంని ఆశ్రయిస్తా'

'ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే సుప్రీంని ఆశ్రయిస్తా'

ఓటర్ల తొలగింపు అంశంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఈ రోజు సీపీఐ కేంద్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, చాడ వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలకు సంసిద్ధత అంశాలపై సీపీఐ కార్యదర్శివర్గానికి నివేదికను అందజేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, లోక్ సభ ఎన్నికల‌లో పోటీ, పొత్తుల అంశాలపై ప్రధానంగా చర్చించారు.

అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ... ఏపీలో డాటా లీక్స్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాం. డాటా లీక్స్, ఓటర్ల తొలగింపు అంశాన్ని పత్రికలలో వచ్చిన కథనాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. ఓటర్ల తొలగింపు అంశంపై జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశానని రామకృష్ణ తెలిపారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు.