చంద్రగిరి రీ-పోలింగ్ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం

చంద్రగిరి రీ-పోలింగ్ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ వివాదంలోకి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం వచ్చారు. సీఎస్ సూచనల మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది రీపోలింగ్ కు సిఫార్సు చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్ ముగిసిన 34 రోజుల తర్వాత రీపోలింగ్ జరపడం విడ్డూరంగా ఉందని టీడీపీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని రోజుల తర్వాత రీపోలింగ్ కు ఆదేశించడం చూస్తుంటే ఎన్నికల ప్రక్రియలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం హస్తం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.