ఏపీ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ..!

ఏపీ కేబినెట్‌ భేటీపై ఉత్కంఠ..!

అమరావతిలో మంగళవారం జరనున్న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ భేటీ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని స్ర్కీనింగ్‌ కమిటీ... ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పంపించారు. ఈ నెల 10వ తేదీన ఆ నివేదికను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపండం జరిగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చర్చనీయాశంగా మారింది. ఎన్నికల సంఘం అనుమతి కావాలంటే కనీసం 48 గంటల ముందు పంపాలని నిబంధనల్లో ఉంది. ఆ నిసంబధన ప్రకారం ఆదివారం సాయంత్రానికి సమయం అయిపోయింది. అయితే, ఇవాళ అనుమతి వస్తుందని భావిస్తున్నా... నేటి సాయంత్రం వరకు ఈసీ నుంచి అనుమతి వస్తేనే కేబినెట్ నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం... దీంతో.. ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది.