'టీడీపీకి 110 స్థానాలు.. చంద్రబాబే మళ్లీ సీఎం..'

'టీడీపీకి 110 స్థానాలు.. చంద్రబాబే మళ్లీ సీఎం..'

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 110 స్థానాల్లో గెలుపొందడం ఖాయమన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప.. చంద్రబాబు నాయుడే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో చంద్రబాబును చూసే ప్రజలు ఓట్లు వేశారన్న చినరాజప్ప... తూర్పు గోదావరి జిల్లాలోని 14 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే టీడీపీకి విజయానికి కారణం కాబోతున్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం.