మోడీ.. మరలా ప్రధాని కాలేవు

మోడీ.. మరలా ప్రధాని కాలేవు

ప్రధాని నరేంద్ర మోడీ తస్మాత్ జాగ్రత్త నీవు మరలా ప్రధాని కాలేవని ఏపీ డెప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. సి బెళగల్ మండలం కొత్తకోటలో జరిగిన జన్మభూమిలో కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి చూసి ప్రధాని మోడీ ఈర్ష పడుతున్నాడు. మోడీ తస్మాత్ జాగ్రత్త నీవు మరల ప్రధాని కాలేవన్నారు. మోడీని ప్రశ్నించే హక్కు సీఎం చంద్రబాబుకే ఉందన్నారు. జగన్ బజార్లో తిరుగుతున్నాడు.. జనం కనిపిస్తే చాలు ముఖమంత్రి చేయమంటున్నాడని విమర్శించారు. జగన్ కు మోడీ అంటే భయం. మోడీ పాదాలను వారి నాయకులు మెుక్కుతున్నారని కృష్ణమూర్తి అన్నారు.