బీసీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా...

బీసీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా...

విజయవాడ ఐవీ ప్యాలెస్ లో జయహో బీసీ గౌడ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, ఎంపీ కొనకళ్ళ నారాయణ మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... బీసీ అని చెప్పుకోవడానికి తాను గర్వపడుతున్నానన్నారు. బీసీలను పట్టించుకొనే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. కుల సమావేశం టీడీపీకి అవసరం. రాబోయే ఎన్నికల్లో బీసీ గౌడ అంతా ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలవాలని కోరారు. తెలంగాణాలో కల్లు గీత కార్మికులు అభివృద్ధిలో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన వారు ఇక్కడ నష్టపోయారు.. వారిని ఆదుకోవాలన్నారు. గౌడ హాస్టల్ ను విజయవాడలో పెట్టేందుకు ప్రభుత్వంతో పోరాడాలని ఉపముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గౌడ కులానికి కార్పొరేషన్, జిల్లాకో కమ్యూనిటీ కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు.

'జాతి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తాం. గీత వృత్తిలోని 90 శాతం మంది మిగతా వృత్తిలోకి వెళ్ళిపోయారు. మిగతా పదిశాతాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. గీతా ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా‌ మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇతర కులాల లాభాలు మనమెందుకు తీసుకోకూడదు అనే అంశంపై త్వరలోనే బహిరంగ సభ ద్వారా కోరదాం' అని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

'ఇతర కులాలకు ఏ విధంగా నిధులు కేటాయిస్తున్నారో.. గౌడ కులానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతాం. కేఈ రిటైరవ్వాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యసభకైనా, ఎమ్మెల్సీగా నైనా వెళ్ళొచ్చు. ఆయన సేవలు పార్టీకి అవసరం. గౌతు లచ్చన్న పేరుతో 20 ఎకరాల ఆసుపత్రి కావాలని ప్రభుత్వాన్ని కోరాం' అని కొనకళ్ళ నారాయణ అన్నారు.