కేసుల ఉపశమనం కోసమే బీజేపీతో దోస్తీ

కేసుల ఉపశమనం కోసమే బీజేపీతో దోస్తీ

కేసుల నుంచి ఉపశమనం కోసమే వైసీపీ అధినేత జగన్ బీజేపీతో దోస్తీ చేస్తున్నాడని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి ఆరోపించారు. ఆదివారం క్రిష్ణమూర్తి కర్నూలులో మాట్లాడుతూ... దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. పోలవరానికి కేంద్రంమే మొత్తం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఏపీ సర్కారు 10 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం మాత్రం 6 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయమనే మేము అడుగుతున్నామని క్రిష్ణమూర్తి తెలిపారు. న్యాయమైన హక్కులు అడిగితే అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బీజేపేతర కూటమిని దెబ్బతీయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ పేరుతో ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఇక కేసుల నుంచి ఉపశమనం కోసమే జగన్ బీజేపీతో దోస్తీ చేస్తున్నాడన్నారు. మోడీ దేశ ప్రదానిలా కాకుండా గుజరాత్ కి మాత్రమే ప్రదానిలా ప్రవర్తిస్తున్నారు. మోడీ కేడీ ఆలోచనలకు రోజులు దగ్గర పడ్డాయి. మోడీని ప్రధాని పదవి నుంచి ధింపడమే మా ధ్యేయం. ఇందుకోసం చంద్రబాబు మహాకూటమి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.