మేం లేకుండా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు...

మేం లేకుండా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు...

ఆంధ్రప్రదేశ్‌లో మా సహకారం లేకుండా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి... కర్నూలులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... నవ్యాంధ్ర నిర్మాణానికి ఆ నలుగురు అడ్డుకట్ట వేస్తున్నారంటూ ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. మేం వేసిన రోడ్ల పై తిరుగుతూ జగన్ అభివృద్ధి జరగలేదు అంటూ వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించిన కేఈ... ఇక పవన్ కల్యాణ్ పిడుగు మాదిరి తన సభల్లో జనాలను చూసి మురిసిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతోందని వ్యాఖ్యానించారు కేఈ కృష్ణమూర్తి... ఈశాన్య రాష్ట్రాలకు వేలకోట్ల నిధులు ఇస్తున్నారు... మాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ఏం చేశారన్న దానిపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన.