చంద్రబాబును ఏమి పీకలేరు : కేఈ

చంద్రబాబును ఏమి పీకలేరు : కేఈ

ప్రజా సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమైతే, జగన్ కు ప్రజల బాగోగులు పట్టవని డిప్యూటీ సిఎం కేఈ.కృష్ణమూర్తి విమర్శించారు. బేతంచెర్ల లో జన్మభూమి లో పాల్గొన్న ఆయన, జగన్ కు ఎంత సేపు సీఎం కుర్చీ యావేనని ఎద్దేవా చేశారు. మోడీ..బోడిలు ఎంతమంది ఏకమైనా చంద్రబాబును ఏమి పీకలేరని ఘాటుగా విమర్శించారు. మోడీకి చంద్రబాబు అంటే భయమని, అందుకే సీబీఐ, ఈడి, ఇన్ కమ్ టాక్స్ అధికారులతో దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ముసలివాళ్లకు ముద్దులు.. పిల్లల కేరింతలతో పాదయాత్రతోనే పొద్దు పుచ్చారన్నారని కేఈ అన్నారు.