ఈ నెల 15 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు

ఈ నెల 15 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు

డీఎస్సీ-2018 హాల్‌టికెట్లను డిసెంబర్ 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి ఓ ప్రకటనలో తెలిపారు. 15 నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ (లాంగ్వేజ్‌, నాన్‌ లాంగ్వేజ్‌) అభ్యర్థులు.. 20 నుంచి  ప్రిన్సిపాల్‌, పీజీటీ, టీజీటీ, ఎల్పీటీ, పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్స్‌ అండ్‌ డ్రాయింగ్‌ అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చని సంధ్యారాణి తెలిపారు. ఇక ఎస్జీటీ అభ్యర్థులు డిసెంబర్16 నుంచి 24 వరకు పరీక్ష కేంద్రాల ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. జనవరి 10 నుంచి ఎస్టీజీ అభ్యర్థులకు హాల్‌ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.