ఏపీ ఎంసెట్-2019 ఫలితాలు విడుదల..

ఏపీ ఎంసెట్-2019 ఫలితాలు విడుదల..

విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న ఏపీ ఎంసెట్‌-2019 ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఏపీ ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఎంసెట్ 2019 ఫలితాలను ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.39శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,38,160 మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు తెలిపారు. మరోవైపు అగ్రికల్చర్ విభాగంలో 83.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ పరీక్షకు 81,916 మంది విద్యార్థులు హాజరు కాగా.. 68,512 మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు. 

ఇంజినీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లను పరిశీలిస్తే... 1. రవిశ్రీతేజ, 2. వేదప్రణవ్‌, 3. భానుదత్త, 4. చంద్రశేఖర్‌, ఎస్‌ఎస్‌ హేద హవ్య, 5. కార్తికేయ, 6. రిషి షరఫ్‌, 7. వెంకటకృష్ణ, సూర్య లిఖిత్‌, 8. అభిజిత్‌రెడ్డి, 9. ఆర్యన్‌ లడ్డా. 10. హేమ వెంకట అభినవ్‌ టాప్ 10 ర్యాంకర్లుగా నిలిచారు. ఇక, అగ్రికల్చర్‌‌, మెడికల్‌ విభాగంలో 1. సుంకర సాయి స్వాతి, 2. దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి, 3. సాయి ప్రవీణ్‌ గుప్తా, 4. తిప్పరాజు హర్షిత, 5. మాధురిరెడ్డి, 6. కృష్ణ వంశి, 7. కంచి జయశ్రీ, వైష్ణవీ వర్మ, 8. సుభిక్ష, 9. కొర్నెపాటి హరిప్రసాద్‌, 10. ఎంపటి కుశ్వంత్‌ టాప్ 10 ర్యాంకర్లుగా ఉన్నారు.