నేటి నుంచి ఏపీ ఎంసెట్‌..

నేటి నుంచి ఏపీ ఎంసెట్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఫార్మసీ, డీ ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీ ఎంసెట్‌-2019 పరీక్షలు ఇవాళ  ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఇంజనీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 86,910 (మొత్తంగా 2,82,633 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 115 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగానే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.