ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా

ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా

ఈ నెల 18న విడుదల కావాల్సిన ఏపీ ఎంసెట్‌ ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తెలంగాణలో ఫెయిలైన ఇంటర్‌ విద్యార్థుల రీవాల్యుయేషన్‌ ఫలితాల తర్వాతే ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

ఏపీ ఎంసెట్ ఫలితాలపై అక్కడి అధికారులు తెలంగాణ అధికారులను సంప్రదించారు. తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫలితాలు ప్రకటించలేదు. ఎంసెట్ ర్యాంకింగ్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ర్యాంకులను ప్రకటిస్తే... తెలంగాణ ఫలితాల అనంతరం విద్యార్ధుల మార్కులు పెరిగితే మళ్లీ ర్యాంకులను మార్చాల్సి ఉంటుంది. సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి అప్పటి వరకు ఆగితే బాగుంటుందని తెలంగాణ అధికారులు తెలిపారు. చివరకు ఏపీ ఎంసెట్ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.