ఏపీ ఈ-సెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఈ-సెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఈ-సెట్ (ఏపీ ఈసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఈసెట్ కోసం 39,734 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... వారిలో 37,066 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్టు వెల్లడించారు విజయరాజు. రాష్ట్రవ్యాప్తంగా 11 ఇంజనీరింగ్ బ్రాంచీలలో ఈసెట్ నిర్వహించామని.. గత ఐదేళ్ల నుంచి జేఎన్టీయూ అనంతపురం.. ఈసెట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.