ఏపీ ఈసెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత

ఏపీ ఈసెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం అమరావతిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌లో 98.37 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి చెప్పారు. ఈనెల 20 నుంచి ర్యాంకు కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు.

ఫస్ట్‌ ర్యాంకర్స్‌ వీరే..  
బయోటెక్నాలజీలో-ఉమామహేశ్వరరావు (తూర్పు గోదావరి)
సిరామిక్ టెక్నాల‌జీ- పిల్లి లోకేష్ (నెల్లూరు)
మైనింగ్‌- ఐ.శివ‌కుమార్ (మంచిర్యాల‌)
ఫార్మసీ- ఎన్.తేజ‌నాగవిశాలి (కాకినాడ‌)
సివిల్‌- సోమారాకేష్ (వ‌రంగ‌ల్‌)