సీఎం జగన్ ఆదేశాలు.. సీబీఎస్‌ఈ సిలబస్‌పై విద్యాశాఖ ఫోకస్

సీఎం జగన్ ఆదేశాలు.. సీబీఎస్‌ఈ సిలబస్‌పై విద్యాశాఖ ఫోకస్

ఆంధ్రప్రదశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సీబీఎస్‌ఈ సిలబస్ అమలుపై కసరత్తు చేస్తోంది విద్యాశాఖ. ఏపీలో దశలవారీగా సీబీఎస్ఈ సిలబస్‌ ప్రవేశపెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. 65 వేల స్కూళ్లల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేయాలని నిర్ణయం తీసుకోనున్నట్టు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెట్టాలన్న నిర్ణయంతో.. ఇంగ్లీష్‌ మీడియం అమలుకు ఆటంకాలు తొలగుతాయనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఇంగ్లిష్‌ మీడియంలోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని విద్యా శాఖలో చర్చ సాగుతోంది.