ఏపీలో గెలుపెవరిది..?

ఏపీలో గెలుపెవరిది..?

ఘర్షణలు.. ఈవీఎంల మొరాయింపుల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. విజేత ఎవరనేది తెలియాలంటే సుదీర్ఘ నిరీక్షణ అవసరం. చివరి దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మే 23న ఫలితాలు విడుదలవనున్నాయి. అంతవరకూ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉంటాయి.  మరోవైపు.. విజయం తమదంటే తమదేనని ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయి.

సంక్షేమ పథకాలపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని.. తమను మరోసారి ఆశీర్వదిస్తారని టీడీపీ భావిస్తోంది. రాజధాని నిర్మాణం, పోలవరం అంశాల్లోనూ ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ అధినేత చెబతున్నారు. తమకు 130 ప్లస్‌ స్థానాలు ఖాయమని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. 

ఇక.. అధికారం తమదేనని వైసీపీ అధినేత జగన్‌ బలంగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి ఒకేమాటపై ఉండడం తమకు లాభిస్తుందని అంచానా వేస్తోంది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన జనసేన.. కింగ్‌మేకర్‌ కావడం ఖాయమన్న ధీమాతో ఉంది.