ఏపీలో ఎన్నికలు వాయిదా వేయండి..

 ఏపీలో ఎన్నికలు వాయిదా వేయండి..

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతి ఏటా ఏప్రిల్ 11వ తేదిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా పూలే జయంతి జరుగుతోంది. ఆ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పూలే జయంతిని జరుపుకునే అవకాశం లేకుండా పోతుంది. కావున ఆరోజు నిర్వహించనున్న ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. అందువల్ల మొదటి విడగతా నిర్వహించతలపెట్టిన ఎన్నికకు ఈసీ జారీ చేసిన ప్రకటనను రద్దు చేయడంతో పాటు, ఆ ఎన్నికను వాయిదా వేసేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించండంటూ.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సామాజిక సేవా కార్యకర్త విజయ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. దీనిలో ఎన్నికల కమిషన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చారు.