'వకీల్ సాబ్' వసూళ్ళకు ప్రభుత్వ జీవో అడ్డంకి అవుతోందా!?

'వకీల్ సాబ్' వసూళ్ళకు ప్రభుత్వ జీవో అడ్డంకి అవుతోందా!?

'వకీల్ సాబ్' వాదనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బలంగా వినిపిస్తున్నాయి. అయినా తెలంగాణలో లాయర్ గారి వాదనలకు భారీ వసూళ్ళు వస్తుంటే... ఆంధ్రాలో మాత్రం ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్‌ 'వకీల్ సాబ్'గా నటించిన దిల్ రాజు లెటెస్ట్ ఎంటర్టైనర్ ఫ్యాన్స్ ను బాగానే థ్రిల్ చేస్తోంది. అయితే తెలంగాణలో ప్రత్యేక షోస్ నడిచినా... ఎపిలో మాత్రం ఎలాంటి స్పెషల్ షోస్ పడలేదు. ఇక టికెట్ రేట్లు కూడా నిర్మాతల కోరిక మేరకు పెంచుకోనిచ్చింది కేసీఆర్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ''నో ఛాన్స్'' అనేసింది గవర్నమెంట్. అదీ కాకుండా థియేటర్స్ లో నాలుగు షోస్ మాత్రమే వేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక టికెట్ రేట్స్ కూడా ఎప్పటిలాగే ఉండాలంటూ జీవో విడుదల చేసింది. అది ఆంధ్రాలో 'వకీల్ సాబ్' వసూళ్ల పై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
బాలీవుడ్ 'పింక్'కి తెలుగు రీమేక్ 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ ఈ సినిమాకి డైరెక్టర్. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ తో కలసి దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. 'వకీల్ సాబ్' విడుదలకు ముందు ఏర్పడిన పాజిటివ్ బజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించగలిగింది. రివ్యూస్ కూడా పాజిటీవ్ గానే వచ్చాయి. పవన్ కమ్ బ్యాక్ కి సరైన సినిమా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఎపిలో టిక్కెట్ రేట్లతో పాటు షోస్ లో పెరుగుదల లేకపోవడం వల్ల రికార్డ్ స్థాయి వసూళ్ళపై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది.