పోలవరంపై సర్కార్ ఫోకస్...

పోలవరంపై సర్కార్ ఫోకస్...

పోలవరం నిర్వాసితులు, పునరావాసంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్... నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించింది.. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఓ. ఆనంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఓవైపు రివర్స్ టెండర్లపై దృష్టిపెట్టిన సర్కార్.. ఇప్పటికే నవయుగకు నోటీసులు జారీ చేయగా.. మరోవైపు నిర్వాసితులు, పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.