అసెంబ్లీలో కమిటీల నియామకం.. ఉత్తర్వులు జారీ..

అసెంబ్లీలో కమిటీల నియామకం.. ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో పలు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.. రూల్స్ కమిటీ చైర్మనుగా స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆరుగురిని సభ్యులుగా నియమించారు. ఇక, పిటిషన్ కమిటీ చైర్మన్‌గా డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మరో ఆరుగురి సభ్యులను నియమించింది సర్కార్. సభా హక్కుల కమిటీ చైర్మనుగా కాకాని గోవర్ధన్ రెడ్డిని నియమించారు. ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ నియామకమయ్యారు. మరోవైపు ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబును నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.