మందు బాబులకు షాక్‌.. వాటిపై కూడా నిషేధం..!

మందు బాబులకు షాక్‌.. వాటిపై కూడా నిషేధం..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు డోర్స్‌ మూసివేసింది ఏపీ సర్కార్... అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు  జారీ చేసింది.. రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది... పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్షార్హులని అబ్కారీ శాఖ పేర్కొంది. మద్యం అక్రమ రవాణతోపాటు.. ఆదాయం కోల్పోతుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే విషయంలో ఆంక్షలు విధించింది ఏపీ సర్కార్.. కాగా, ఇప్పటి వరకు మూడు బాటిళ్ల మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.. తాజా ఉత్తర్వుల్లో వాటిపై నిషేధం విధించింది.