మరో సంచలన నిర్ణయం.. పోలవరం టెండర్లు రద్దు

మరో సంచలన నిర్ణయం.. పోలవరం టెండర్లు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువకు టెండర్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్యాకేజీ 5ఏలోని సుమారు రూ. 65 కోట్ల విలువైన టెండర్‌ను రద్దు చేసింది. పీఎస్కే-హెచ్‌ఈఎస్ ఇన్ఫ్రా కంపెనీలు చేస్తున్న పనులకు.. కాంట్రాక్టు అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేయనుంది ప్రభుత్వం. త్వరలో రివర్స్ టెండరింగ్ ద్వారా కొత్త ఏజెన్సీకి పనులు అప్పగించనుంది.