బ్రేకింగ్‌: సర్కార్ నిర్ణయం మారింది.. విజయవాడలోనే రిపబ్లిక్‌ డే..!

బ్రేకింగ్‌: సర్కార్ నిర్ణయం మారింది.. విజయవాడలోనే రిపబ్లిక్‌ డే..!

మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ వేగంగా ముందుకు వెళ్తోంది... ఇప్పటికే అసెంబ్లీలో దీనికి సంబంధిచిన బిల్లు ఆమోదం లభించింది... ఇక, ఇవాళ శాసన మండలి ముందుకు బిల్లు వెళ్లింది. మరోవైపు, విశాఖ నుంచి ఈ నెలలోనే పాలన ప్రారంభించాలని వైసీపీ సర్కార్ ప్రణాళికగా ఉంది. అందులో భాగంగా... జనవరి 26న రిపబ్లిక్ డేను వైజాగ్‌లోనే నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన రిహార్సల్‌ కూడా కొనసాగుతుండగా.. ప్రభుత్వం ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది... ఈసారికి విజయవాడలోనే రిపబ్లిక్ డే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైజాగ్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయించిన వైఎస్ జగన్ సర్కార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తుంది. విజయవాడలో రిపబ్లిక్ డే నిర్వహించడం వల్ల అక్కడ ప్రజల్లో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలనే యోచనలో సర్కార్ పెద్దలు ఉన్నట్టు సమాచారం.