గన్నవరం విమానాశ్రయం విస్తరణపై ఏపీ సర్కార్ ఫోకస్

గన్నవరం విమానాశ్రయం విస్తరణపై ఏపీ సర్కార్ ఫోకస్

గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమస్యల పరిష్కారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణలో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు రూ. 112.75 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. బుద్దవరం, దావాజీగూడెం, అల్లపురం గ్రామాల్లో విమానాశ్రయ విస్తరణ కారణంగా ప్రభావితమయ్యే 423 కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపును పూర్తి చేసింది ప్రభుత్వం. అజ్జంపూడి గ్రామంలో విస్తరణ ప్రభావిత కుటుంబాలకు ప్లాట్లను కేటాయించిన ప్రభుత్వం.... కేటాయించిన ప్లాట్లల్లో ప్రభావిత కుటుంబాలే సొంతంగా ఇళ్లను నిర్మించుకోనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.  ప్రభావిత కుటుంబాలకు రూ. 57.20 కోట్ల మేర పరిహారాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకుంది. యాన్యూటీ నిమిత్తం రూ. 42.94 కోట్ల కేటాయింపు చేసింది. రక్షిత మంచి నీటి ట్యాంకు.. విద్యుత్ హెటెన్షన్ లైన్ల ఏర్పాటు, భూసేకరణ వంటి అంశాలకు నిధులను కేటాయించింది ఏపీ సర్కార్.