ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సీఎం జగనుతో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు ఆదిమూలపు సురేష్. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని..విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. ముందు రోజుల్లో ఒక వేళ కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అటు ఒకటి, రెండు రోజుల్లో పదో పరీక్షల పై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ ప్రభుత్వం.Cbse నిర్ణయంనే తెలంగాణలోను అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.  ఇప్పటికైతే షెడ్యూల్ ప్రకారం మే ఒకటి నుండి ఇంటర్.. మే 17 నుండి 10 వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. కాగా కరోనాతో ఈ నెల 7 నుండి జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష లను వాయిదా వేసింది ఇంటర్ బోర్డ్.