కరోనా చికిత్స పై నిపుణుల కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం...

కరోనా చికిత్స పై నిపుణుల కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం...

ఏపీలో కోవిడ్ విస్తృతి,  నియంత్రణా చర్యలను సిఫార్సు చేసేందుకు రాష్ట్ర ఎపిడెమోలోజికల్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి సహా 9 మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవటంతో పాటు కోవిడ్ విస్తృతిని పసిగట్టి అందుకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టేలా కమిటీకి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారి మరింత విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయనుంది ఈ కమిటీ. నమూనాల సమాచార సేకరణ, విశ్లేషణ, ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల అమలు, రాష్ట్రంలో క్షేత్రస్థాయి వరకూ సాంకేతిక సామర్ధ్యాల పెంపు , నిపుణుల నియామకం , వైద్య సిబ్బంది  నియామకాలు, ముందస్తు హెచ్చరికల వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటం వంటి బాధ్యతల్ని కమిటీకి అప్పగించింది ప్రభుత్వం.