ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఎరువుల కొనుగోళ్లకు అవసరమైన నిధుల కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల కొనుగోళ్లు, సరఫరా, బఫర్ స్టాక్ కోసం రూ. 500 కోట్ల మేర రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్క్ ఫెడ్ తీసుకున్న రుణం మీద వడ్డీ చెల్లింపులను ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేసింది. ఎరువుల కొనుగోళ్లు.. అమ్మకాల ధరల విషయంలో ఏమైనా మార్పులు జరిగి నష్టాలొస్తే ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్. ఎరువుల కొనుగోళ్లు, సరఫరా బాధ్యతలు చేపట్టేందుకు నోడల్ ఏజెన్సీగా మార్క్ ఫెడ్ ను నియమించింది ప్రభుత్వం. అవసరమైన మేర ఎరువులు కొనుగోళ్లు చేసి సరఫరా చేయాలని సూచనలు చేసింది. జిల్లాల వారీగా ఎంత మేర బఫర్ స్టాకు పెట్టుకోవాలన్న అంశాన్ని లెక్కలతో సహా జీవోలో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.