'వైఎస్‌ఆర్‌ జలకళ'లో కీలక సవరణలు.. ఉత్తర్వులు జారీ

'వైఎస్‌ఆర్‌ జలకళ'లో కీలక సవరణలు.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం వైఎస్‌ఆర్ జళకళ'.. ఇప్పుడు ఈ పథకంలో కీలక సవరణలు చేసింది సర్కార్... సవరణలతో కూడిన ఉత్వర్వులను కాసేపటి క్రితమే విడుదల చేసింది ప్రభుత్వం.. ఈ సవరణల ప్రకారం.. పని చేయని బోర్లున్న రైతులకూ వైఎస్సార్ జలకళను వర్తింపజేయనున్నారు.. సర్వీసులో ఉన్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు వైఎస్సార్ జలకళకు అనర్హులుగా ప్రకటించింది సర్కార్... రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతు గ్రూపులకూ పథకం వర్తింపజేయనున్నారు.. రైతు కుటుంబంలో ఒకరికి మాత్రమే వైఎస్సార్ జలకళ వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది.. పొలంలో మొదటి బోరు విఫలమైతే హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.. సర్వేలో నీటి లభ్యత నిర్ధారణ అయ్యాకే పొలంలో రెండో బోరు వేసేలా నిబంధనలు తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్..