బ్రేకింగ్: ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ..?

బ్రేకింగ్: ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై లోకాయుక్త విచారణ..?

రాజధాని ప్రాంతం అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.. మరోవైపు అక్రమాలు జరిగిఉంటే విచారణ జరపాలని టీడీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త విచారణ చేపట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేపటి కెబినెట్ భేటీలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై విచారణ బాధ్యతలను లోకాయుక్తకు అప్పగించే  అవకాశాలున్నాయి. చంద్రబాబు, లోకేష్ సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇప్పటికే ప్రభుత్వానికి  కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది. గత ప్రభుత్వంలోని పెద్దలు 4070 ఎకరాల మేర భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటోంది ప్రభుత్వం.