కరోనా అన్ లాక్ మార్గదర్శకాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...

కరోనా అన్ లాక్ మార్గదర్శకాల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం...

2021 డిసెంబరు 31 తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ప్రోటోకాల్, అన్ లాక్ మార్గదర్శకాలు పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్ పరీక్షలు, కంటైన్మెంట్, ఇతర నిర్ధారిత నిబంధనల్ని పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల ధారణ, భౌతిక దూరం, శానిటైజేషన్ ప్రక్రియలు, ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. కేంద్ర హోంశాఖ సూచనల మేరకే విదేశీ ప్రయాణికుల రాకపోకలు ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన కోవిడ్ నిబంధనలు, అన్ లాక్ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.