ఏపీలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు..!

ఏపీలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఫాలో అవుతున్నారు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... వైఎస్ హయంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాఆంధ్ర.. మూడు ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు ఉండగా.. ఇప్పుడు సీఎం జగన్‌ కూడా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను తిరిగి ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఐదు మండళ్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఉత్తరాంధ్ర, కోస్తా, కృష్ణ - గుంటూరు, ప్రకాశం - నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలుగా మొత్తం ఐదు మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి చైర్మన్లను నియమించనున్నట్లుగా తెలుస్తోంది.