టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌.. రూ. 106 కోట్లు ఆదా..

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌.. రూ. 106 కోట్లు ఆదా..

ఏపీ టిడ్కోలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. టిడ్కోలో చేపట్టిన నాలుగు ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగుకు వెళ్లింది ఏపీ మున్సిపల్ శాఖ. చిత్తూరు, కృష్ణా, విశాఖ, విజయనగరం జిల్లాల్లోని టిడ్కో ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లగా.. రూ. 707 కోట్ల విలువైన టెండర్లను రూ. 601 కోట్లకు కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నాయి మూడు సంస్థలు.. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాం... రూ. 106 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. 

గత ప్రభుత్వ విధానాలను కొనసాగించి ఉంటే ప్రతీ కుంటుంబానికీ రూ. 75 వేల నుంచి రూ. 90 వేల వరకు భారం పడేదన్నారు బొత్స.. గత ప్రభుత్వం పంచ భూతాలను పంచుకు తినేసిందంటూ విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రస్తుత రివర్స్ టెండరింగ్ విధానం వల్ల చదరపు అడుగుకు రూ. 300 తక్కువగా నిర్మాణం చేస్తున్నట్టు వెల్లడించారు. 65928 టిడ్కో ఇళ్లకు రివర్స్ టెండరింగుకు వెళ్తున్నాం.. చంద్రబాబు పాపాలు తుడిచేయడానికే భగవంతుడు మమ్మల్ని అధికారంలోకి తెచ్చాడని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వమే కొనసాగి ఉంటే రూ.2626 కోట్ల దోపిడీ జరిగేదని ఆరోపించారు బొత్స.