టీటీడీ ఛైర్మన్‌పై వేటు వేసేందుకు సిద్ధమైన సర్కార్..!

టీటీడీ ఛైర్మన్‌పై వేటు వేసేందుకు సిద్ధమైన సర్కార్..!

టీటీడీ పాలకమండలిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది... టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్‌పై కొత్త అస్ర్తం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న సుధాకర్ యాదవ్... స్విమ్స్‌లో అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక సమర్పించింది టీటీడీ... ఈ కారణంగా చైర్మన్ పదవి నుంచి సుధాకర్ యాదవ్‌ని సస్పెండ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం. స్వీమ్స్ వ్యవహారాలపై సుధాకర్ యాదవ్ ని వివరణ కోరనున్నారు... వివరణపై సంతృప్తి చెందకపోతే చైర్మన్ పదవి నుంచి పుట్టాను తొలగిస్తారని తెలుస్తోంది. ఆర్డినెన్స్ ద్వారా పాలక మండలి రద్దుకు న్యాయ పరమైన సమస్యలు ఉన్నాయి... దీనిపై కోర్టుకు వెళ్లి కొనసాగింపు ఉత్తర్వులు తెచ్చుకోనే అవకాశం ఉండటంతో.. ఆర్డినెన్స్ ఆలోచన ప్రభుత్వం విరమించుకున్నట్టు సమాచారం.