బాబు ఫ్యామిలీకి భద్రత తొలగింపు..!

బాబు ఫ్యామిలీకి భద్రత తొలగింపు..!

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులకు భద్రత తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వేడి పెంచుతోంది. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకునే సరికి భద్రత ఉపసంహరణపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్న లోకేష్‌కు భద్రత తగ్గించారు. గతంలో 5+5 భద్రత ఉండగా... ఇప్పుడు 2 + 2 భద్రత మాత్రమే ఇచ్చింది ప్రభుత్వం. అలాగే మిగతా కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రతను తొలగించింది ఏపీ సర్కార్. కనీస సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో భద్రత తగ్గించడానికి తప్పుబడుతున్నారు టీడీపీ నేతలు. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేతగా, పాదయాత్రలో కూడా కావాల్సినంత భద్రతను గత టీడీపీ ప్రభుత్వం కల్పించిందని గుర్తుచేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అయితే, తాము భద్రత తొలగించలేదని.. కుదించామని... ఇది రొటీన్‌గా జరిగే తంతే అంటున్నారు పోలీసులు.