సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై సర్కార్ సీరియస్..

సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై సర్కార్ సీరియస్..

సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది... ప్రభుత్వం, ప్రభుత్త పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తరపున ప్రెస్‌నోట్ విడుదల చేశారు ఏపీ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి  రజత్ భార్గవ. పెట్టుబడిదారులు ఏపీ నుంచి వెళ్లిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీపీ సంస్థ ఏపీని వీడుతున్నట్టు అసత్యాలు ప్రచారమవుతున్నాయని.. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రకటనలో హెచ్చరించారు. మలేసియాకు చెందిన ఆసియా పల్ప్ అండ్ పేపర్స్ సంస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. ఇలా దుష్ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని.. ఆసియా పల్ప్ అండ్ పేపర్ యాజమాన్యంతో పరిశ్రమల శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.