ఏపీలో నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ!

ఏపీలో నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ!

రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ఇక నేరుగా డోర్ డెలివరీ చేయాలని నేటి ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సెప్టెంబర్ 5 నుంచి బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. త్వరలో గ్రామ వాలంటీర్ల ద్వారా రేషన్‌ కార్డుదారుల ఇళ్లకే నిత్యావసరాలు చేరవేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.