ఏపీలో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో సీబీఐని నిషేదిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి రద్దు చేశారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీబీఐ.. దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీబీఐని కేంద్రం రాజకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ చట్టాన్ని సవరించారు. గత ప్రభుత్వం హాయంలో నిర్మించిన వివిధ ప్రాజెక్టుల సీబీఐ విచారణ జరిపించాలని ఇప్పటికే వైసీపీ, బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ సాధారణ సమ్మతిని పునరుద్దరించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.